ఇందుకే కదా జనం ఛీ కొట్టింది.. కార్యకర్త మృతిపై స్పందించిన మంత్రి నారా లోకేష్

by Ramesh Goud |
ఇందుకే కదా జనం ఛీ కొట్టింది.. కార్యకర్త మృతిపై స్పందించిన మంత్రి నారా లోకేష్
X

దిశ, వెబ్ డెస్క్: ఇందుకే కదా జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)ని జనం ఛీ కొట్టారని ఏపీ మంత్రి నారా లోకేష్ (AP Minister Nara Lokesh) అన్నారు. మూక దాడిలో టీడీపీ కార్యకర్త మృతి (TDP Activist Died) చెందడంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. వైసీపీ అధినేత జగన్ పై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ టీడీపీ కార్యకర్త మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన.. వైసీపీ (YCP Goons) రాక్షస మూక‌ల దాడిలో గాయ‌ప‌డి మృతి చెందిన‌ చిత్తూరు జిల్లా (Chittor District) పుంగనూరు మండలం (Punganur Mandal) కృష్ణాపురానికి (Krishnapuram) చెందిన‌ టీడీపీ కార్యకర్త రామకృష్ణకు క‌న్నీటి నివాళులు అర్పిస్తున్నాను అని అన్నారు.

ఈ దాడిలో గాయ‌ప‌డిన రామ‌కృష్ణ కొడుకు సురేష్‌కి మెరుగైన వైద్యం (Better Treatment) అందించే ఏర్పాట్లు చేశానని తెలియజేశారు. శవం ద‌గ్గర పుట్టి, మ‌రో మృత‌దేహంతో అధికారంలోకి వచ్చిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని జ‌నం ఛీకొట్టారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయినా హ‌త్యారాజ‌కీయాలు (Murder Politics) మాన‌డం లేదని విమర్శించారు. నిందితులను చ‌ట్ట ప్రకారం శిక్షిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. అంతేగాక వైసీపీ ర‌క్తచ‌రిత్రకు (YCP Blood History) టీడీపీ సైనికుడిని కోల్పోవ‌డం చాలా బాధాక‌రంగా ఉందని, వారి కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.

Next Story

Most Viewed