Holiday:ఈ నెల 27న వారికి ప్రత్యేక సెలవు.. కారణం ఇదే!

by Jakkula Mamatha |
Holiday:ఈ నెల 27న వారికి ప్రత్యేక సెలవు.. కారణం ఇదే!
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ(Graduate MLC Elections) ఎన్నికల నామినేషన్లకు ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. రెండు పట్టభద్రుల, ఒక ఉపాధ్యాయ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఉభయగోదావరి పట్టభద్రుల నియోజకవర్గం, అలాగే కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నిక జరగనుంది. అదేవిధంగా ఉత్తరాంధ్ర (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం) ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఈ క్రమంలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ నామినేషన్ వేశారు. ఇదిలా ఉంటే.. గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఓటర్లుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల 27వ తేదీన స్పెషల్ క్యాజువల్ లీవ్ ఉండనుంది. ఉమ్మడి కృష్ణా-గుంటూరు, ఉభయ గోదావరి పట్టభద్రులు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ నియోజకవర్గాల్లోని వారికి ఈ సెలవు వర్తిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ ఆదేశాలిచ్చారు. ప్రైవేటు ఉద్యోగులు కూడా ఓటు వేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.

Next Story