Kandukur stampede: ఘటనపై సీఎం జగన్ రియాక్షన్ ఇదే..!

by Nagaya |   ( Updated:2022-12-29 08:04:33.0  )
Kandukur stampede: ఘటనపై సీఎం జగన్ రియాక్షన్ ఇదే..!
X

దిశ, డైనమిక్ బ్యూరో : కందుకూరు ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన కుటుంబాలకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మరణించివారికి రూ.2 లక్షల చొప్పున , గాయపడ్డ వారికి రూ.50వేల చొప్పున పరిహారం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఢిల్లీ పర్యనటలో ఉన్న ముఖ్యమంత్రి ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

కందుకూరు ఘటనపై గవర్నర్ దిగ్భ్రాంతి

కందుకూరులో బుధవారం రాత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఇద్దరు మహిళలతో సహా 8 మంది మృతి చెందడంపై గవర్నర్ బీబీ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు గవర్నర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను గవర్నర్ హరిచందన్ ఆదేశించారు.

Read more:

పార్టీ జెండా మోసే కార్యకర్తల పాడె మోయాల్సి రావడం బాధాకరం : బాలకృష్ణ

Advertisement

Next Story