Breaking: టీడీపీ ప్రచార రథంపై దాడి.. తీవ్ర ఉద్రిక్తత

by srinivas |
Breaking: టీడీపీ ప్రచార రథంపై దాడి.. తీవ్ర ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా కుందుర్పి మండలం వడ్డేపాళ్యంలో ఉద్రికత్త చోటు చేసుకుంది. టీడీపీ ప్రచారం రథంపై ప్రత్యర్థులు దాడి చేశారు. టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఒక్కసారిగా రెచ్చిపోయారు. దూరం నుంచి ప్రచార రథం వైపు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఓ బాలుడి తలకు తీవ్ర గాయం అయింది. వెంటనే బాలుడిని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్రబాబు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అయితే ఈ ఘటనపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ మూకలే ఈ పని చేశారని మండిపడుతున్నారు. తాము తలుచుకుంటే నియోజకవర్గాల్లో వైసీపీ ప్రచార రథాలు తిరగవని హెచ్చరించారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో తమ ప్రచార రథాలపై రాళ్లు విసురుతున్నారని మండిపడ్డారు. దమ్ముంటే ఎదురుగా వచ్చి ఢీకొట్టాలని సవాల్ విసిరారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు వడ్డేపాళ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story