- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Visakha: వైఎస్సార్ విగ్రహం తొలగింపు.. ఉద్రిక్తత
దిశ, వెబ్ డెస్క్: విశాఖ అక్కయ్యపాలెం హైవే పార్క్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొంతమంది వైసీపీ నాయకులు రాత్రికి రాత్రికి వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీంతో కూటమి నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా వైఎస్ విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేస్తారంటూ మున్సిపల్ అధికారులను నిలదీశారు. వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. స్థానిక పోలీసులు, జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కయ్యపాలెం హైవే పార్క్ వద్ద ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని జీవీఎంసీ అధికారులు తొలగించారు. దీంతో టీడీపీ నేతలు ఆందోళనను విరమించారు. అయితే వైఎస్ విగ్రహాన్ని తొలగించడాన్ని వైసీపీ నేతలు తప్పుబట్టారు. టీడీపీ నేతలకు వ్యతిరేకంగా నానాదాలు చేశారు. వెంటనే వైఎస్సార్ విగ్రహాన్ని అదే చోట ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వైసీపీ నేతల ఆందోళనను విరమింపజేశారు. దీంతో కొంతసేపు అక్కయ్యపాలెం హైవే పార్క్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.