- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Ap: జీవీఎంసీ పీఠం.. కూటమి పరం..!

దిశ, వెబ్ డెస్క్: జీవీఎంసీ(Gvmc) పీఠం కూటమి పరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారం మారినప్పటి నుంచి జీవీఎంసీ పీఠంపై కూటమి ప్రభుత్వం కన్ను వేసింది. మేయర్ పీఠం దక్కించునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. 64 మంది కార్పొరేటర్ల మద్దతు లభిస్తే మేయర్ పీఠం కూటమికి దక్కే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం కూటమికి 56 మంది కార్పొరేటర్లు మద్దతు ఇస్తున్నారు. దీంతో మరో 8 మంది బలం కావాల్సి ఉంది.
అయితే 9 మంది వైసీపీ(Ycp) కార్పొరేటర్లు టీడీపీ, జనసేనలో చేరేందుకు సిద్ధమైపోయారు. దీంతో కూటమి కార్పొరేటర్ల బలం 65కు చేరుకోనుంది. మరికొంత మంది వైసీపీ కార్పొరేటర్లు కూడా కూటమి వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. టీడీపీకి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల రూపంలో 12 మంది ఎక్స్ అఫీషియో ఓట్లు ఉన్నాయి. దీంతో మేయర్ పీఠం కూటమి పరం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
మరోవైపు ప్రస్తుత మేయర్ హరి వెంకటకుమారి(Mayor Hari Venkatakumari) పదవీకాలం మంగళవారంతో నాలుగేళ్లు పూర్తి అవుతోంది. దీంతో నెంబర్ గేమ్ ప్రారంభమైంది. అవిశ్వాస తీర్మాన్ని ప్రవేశపెట్టేందుకు కూటమి నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. మేయర్‌పై అవిశ్వాసం పెట్టేందుకు ఇప్పటికే సంతకాల సేకరణ చేసినట్లు సమాచారం. మేయర్ పీఠం తమకు దక్కితే విశాఖ(Visakha)లోని డివిజన్లు అభివృద్ధి చెందుతుందని కూటమి నాయకులు చెబుతున్నారు. మరికొద్ది రోజుల్లో మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాన్ని కూటమి ప్రభుత్వం కైవసం చేసుకోబోతోందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.