ఖతర్నాక్ దొంగలు.. అధికార పార్టీ MLA ఇంట్లోనే దొంగతనం

by sudharani |   ( Updated:2023-01-28 07:11:55.0  )
ఖతర్నాక్ దొంగలు.. అధికార పార్టీ MLA ఇంట్లోనే దొంగతనం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఏకంగా ఎమ్మెల్యే ఇంట్లోనే దొంగతనం చేశారు. కృష్ణ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. అనిల్ కుమార్ స్వస్థలం అయిన బాపులపాడు మండలం శేరీనరసన్నపాలెం ముందడుగు కాలనీలోని ఆయన ఇంట్లో దొంగలు దాదాపుగా రూ. 3 లక్షలు విలువ చేసే బంగారం ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే దొంగతనం జరిగిన ఇంట్లో ఎమ్మెల్యే ఉండటం లేదు.

ఆయన తల్లిదండ్రులు ఉంటున్నా.. వారు కూడా నెల క్రితమే కొడుకు ఉంటున్న ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలోనే శేరీనరసన్నపాలెంలో ఉన్న ఇళ్లు తాళం వేసి ఉండటం గమనించిన దొంగలు చోరీకి పాల్పడ్డారు. దీనిపై అనిల్ కుమార్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed