- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వైసీపీకి చరమగీతం పడాల్సిన సమయం వచ్చింది: పులివర్తి నాని
దిశ,తిరుచానూరు:ఇకపై దౌర్జన్యాలు చెల్లవని అధికారం చేపట్టబోయేది తెలుగుదేశం పార్టీ నేనని చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అన్నారు.తిరుచానూరులో బుధవారం టీడీపీ చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు సిఆర్ రాజన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పులివర్తి నాని, చిత్తూరు ఎంపీ అభ్యర్థి ప్రసాద్ రావు లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ 2019లో దొంగ ఓట్లతో గెలుపొందిన చెవిరెడ్డి మళ్లీ అదే పంథా కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సిఆర్ రాజన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు ల మధ్య చిచ్చు పెట్టడానికి సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మాది అన్నదమ్ముల అనుబంధం అని పేర్కొన్నారు. నాని వంశంలో మోసం చేయడం ఉండదని స్పష్టం చేశారు.
తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాలకు చెందిన పార్టీ కాబట్టే బిసి సామాజిక వర్గానికి చెందిన సిఆర్ రాజన్ కు చిత్తూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్ష పదవిని అచ్చెన్నాయుడు ప్రకటించడం జరిగిందన్నారు. గత వారం తిరుచానూరు పర్యటనలో ఇంటింటికి తిరుగుతుంటే సిఆర్ రాజన్న పనితనం అర్థమైందన్నారు.ఆయన చేసిన సహాయాన్ని ప్రజలందరూ నెమరువేసుకుంటున్నారని కొనియాడారు. నేను ఎవరికి భయపడను. వారి వెనుక ఎంత పెద్ద నాయకులు అయినా సరే తిరుచానూరులో వంకలు, వాగులు, ప్రభుత్వ భూముల కబ్జాలకు పాల్పడిన వారి లెక్కలు సరి చేస్తానన్నారు.
భూ బకాసురుడు భాస్కర్ రెడ్డి 5 వేల కోట్లు అక్రమ సంపాదన మూటగట్టుకున్నాడని ధ్వజమెత్తారు. ఎర్రచందనం, ఇసుక, మట్టి, మఠం భూములు స్వాహా చేశారని ఆరోపించారు.నియోజకవర్గంలో ఇళ్లు లేని వారికి పాడిపేటలో 4 వేల ఇళ్లు కట్టించి టిట్కో పథకం ద్వారా అందజేస్తానని హామీ ఇచ్చారు. అలాగే పేద బ్రాహ్మణుల కోసం అగ్రహారం పేరుతో టిట్కో ఇళ్లు కట్టిస్తానన్నారు. తుమ్మలగుంట అపరిచితుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే కనిపిస్తాడని ఓటును నోటుకు అమ్ముకోవద్దని హితవు పలికారు.
జగన్ కు అత్యంత ఆప్తుడని చెప్పుకునే చెవిరెడ్డి ఉద్యోగాలు ఇచ్చాడా.. ఫ్యాక్టరీలు తెచ్చాడా అని ప్రశ్నించారు.టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యక్షంగా పరోక్షంగా 10వేల ఉద్యోగాలు కల్పిస్తానని పులివర్తి నాని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తిరుపతి రూరల్ మండలం అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి , రాష్ట్ర టిఎన్టియుసి కార్యనిర్వాహణ కార్యదర్శి అమ్మినేని మధు, చంద్రగిరి తిరుపతి రూరల్ మండలం బీసీ సెల్ అధ్యక్షులు మునికృష్ణారెడ్డి తిరుచానూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి తెలుగు యువత హరే రామ్, జనసేన తిరుపతి రూరల్ అధ్యక్షులు వెంకట్ రాయల్, తెలుగుదేశం సానుభూతిపరులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Read More..
టీడీపీ సోషల్ మీడియాలో మూడో ర్యాంకు సాధించిన TNSV జిల్లా కార్యదర్శి