- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Breaking: అధినేతల పొత్తు.. ఆ నియోజకవర్గం టికెట్ కోసం అనుచరుల కసరత్తు
దిశ డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం, జనసేన పార్టీల అధినేతలు పొత్తు కలుపుకున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో ఇరు పార్టీల అనుచరులు సీట్ల విషయంలో కత్తులు దూసుకుంటున్నారు. ఇప్పటికే రాజానగరం టికెట్ విషయంలో అటు టీడీపీ నేతలకు ఇటు జనసేన నేతలకు పొత్తు కుదరడం లేదు. అయితే తాజాగా ఈ కోవలోకి తాడేపల్లి గూడెం నియిజకవర్గం కూడా వచ్చి చేరింది. జనసేన పార్టీ నేత బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లి గూడెం నాదే అంటున్నారు. మరో వైపు టీడీపీ నుండి వలవల బాబ్జీ పోటీకి సిద్ధమయ్యారు.
ఈ నేపధ్యంలో తాడేపల్లి గూడెం నుండి ఎన్నికల బరిలోకి దిగేది ఎవరు అనే ప్రశ్న ఆసక్తికరంగా మారింది. అసలు తాడేపల్లి గూడెం నుండి వీరిద్దరిలో ఎవరో ఒకరు బరిలో ఉంటారా..? లేక ఇరు పార్టీల అధినేతలు మరో వ్యక్తిని రంగం లోకి దింపుతారా అనేది అధినేతలకే తెలియాలి..?తాడేపల్లి గూడెం కోసం దశబ్దాలుగా త్యాగాలు చేసాం కనుక ఆ టికెట్ మాదే అని టీడీపీ నేతలు అంటున్నారు .
అయితే బొలిశెట్టి మాత్రం గూడెం తనదే అంటున్నారు. ఇప్పటికే తాడేపల్లి గూడెం పక్కన ఉన్న తణుకులో జనసేన పార్టీకి టికెట్ ప్రకటించారు. దీనితో తాడేపల్లి గూడెం తమదే అనే ధీమాతో టీడీపీ నేతలు ఉన్నారు. అయితే తాడేపల్లి గూడెం కూడా తమదే అని తెగేసి చెబుతున్నారు జనసేన నేతలు. కాగా టీడీపీ నుండి జనసేన గూటికి చేరిన బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లి గూడెం తనదేనంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పొత్తు ధర్మం పేరుతో తనకు తాడేపల్లి గూడెం టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా అయినా సరే బరిలో దిగేందుకు సిద్ధం అని అనుచరులతో చెప్పినట్లు సమాచారం.
mariఈ పరిస్థితిలో ఒకవేళ బొలిశెట్టి పార్టీ లో కొనసాగిన టీడీపీకి సహకరిస్తారా..? లేదా అనేది ప్రస్తుతం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అధినేతలు పైకి పొత్తు కనబరుస్తున్న.. వాళ్ళ అనుచరులు మాత్రం కత్తులు దూసుకుంటున్నారు. విడవమంటే పాముకి కోపం..కరవమంటే కప్పుకు కోపం అనేలా ఉంది ప్రస్తుతం టీడీపీ, జనసేన అధినేతల పరిస్థితి. ఎన్నికల సమయం దగ్గర పడుతోంది.. ఇలాంటి వేళ పొత్తు కలుపుకున్న టీడీపీ జనసేన ల మధ్య పోరు రాజుకుని ఆ పోరు పొగ బయటకు వస్తే మొదటికే మోసం వస్తుంది. ఈ క్రమంలో అనుచరులకు ఎలా సర్దిచెప్పాలో తెలియక అధినేతలు తలలు పట్టుకుంటున్నారు.