ఆ కారణంతోనే నేను రంగంలోకి దిగాల్సి వచ్చింది: స్పీకర్ తమ్మినేని

by Mahesh |   ( Updated:2024-01-25 03:57:57.0  )
ఆ కారణంతోనే నేను రంగంలోకి దిగాల్సి వచ్చింది: స్పీకర్ తమ్మినేని
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దాదాపు మూడు సంవత్సరాల క్రితం ఆయన రాజీనామా లేఖను స్పీకర్ కు అందించగా.. తాజాగా స్పీకర్ గంటా రాజీనామాకు ఆమోదం తెలిపారు. అయితే ఇన్ని రోజులు తన రాజీనామాపై స్పందించకుండా.. హోల్డ్ లో పెట్టిన స్పీకర్ ఇప్పుడు స్పందించి ఆమోదం తెలపడం వెనుక రాజకీయ కుట్ర దాగిఉందటూ గంటా శ్రీనివాస రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే రాజ్యసభ అభ్యర్థుల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ కుట్రలో భాగంగా ఇలా చేశారని ఆయన ఆరోపించారు.

ఈ ఆరోపణలపై స్పీకర్ తమ్మనేని సీతారాం స్పందించారు. గంటా రాజీనామా లేఖ నాకు ఎప్పుడు చేరింది. కానీ నేను మానవతా దృక్పథంతో ఆలస్యం చేశాను. కానీ ఇప్పుడు స్పీకర్ గా నా పదవీకాలం ముగుస్తుండటంతో తాను యాక్షన్ లోకి దిగాల్సి వచ్చిందని స్పీకర్ తమ్మినేని స్పష్టం చేశారు. గంటా శ్రీనివాస్ రావు కావాలంటే న్యాయపోరాటం చేసుకోవచ్చని సలహా ఇచ్చాడు. అలాగే రాజ్యసభ సీటు కోల్పోతాం అనుకున్నప్పుడు ఎందుకు అందరికీ నోటీసులు జారీ చేస్తామని ప్రశ్నించారు. అలాగే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు జారీ చేశాను. వారంలోపు అంతా క్లియర్ చేస్తామని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed