- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సుల షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెవెన్యూ సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. గ్రామస్థాయిలో భూ వివాదాల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గాను ప్రభుత్వం రెవెన్యూ సదస్సుల షెడ్యూల్ ను విడుదల చేసింది. దీని ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు సదస్సులు నిర్వహించనున్నారు. 22ఏ, ఫ్రీహోల్డ్, భూ ఆక్రమణలపై అధికారులు ఫిర్యాదులు స్వీకరించనున్నారు. అలాగే గ్రామ, మండల, జిల్లా స్థాయిలో షెడ్యూల్ ప్రకటించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రజల నుంచి పిటిషన్లతో పాటు ఆర్టీజీఎస్ పోర్టల్ ద్వారా అర్జీ లు తీసుకోవాలని ప్రభుత్వం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ నెల 5 నుంచి గ్రామస్థాయిలో షెడ్యూల్ ప్రకటించాలని, సదస్సు నిర్వహణకు ముందే సదరు గ్రామానికి సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా స్థాయిలో పార్టీలు, ఎన్జీవోలు, రైతు సంఘాలను ఆహ్వానించనున్నారు. భూ వివాదాలు తగ్గించేలా రెవెన్యూ సదస్సులు ఉండాలని, భూ సమస్యల పరిష్కారానికి రుసుము వసూలు చేయొద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే గత ప్రభుత్వ సమయంలో ఆక్రమణల్లో భూములు కోల్పోయిన బాధితులకు అండగా ఉండాలని స్పష్టం చేసింది.