- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇద్దరు బాలికలపై అత్యాచారం..ప్రభుత్వం కీలక నిర్ణయం
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఇటీవల మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తాజాగా స్పందించి ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బాలికలపై జరుగుతున్న ఘటనలపై తాజాగా హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. వివరాల్లోకి వెళితే.. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో అత్యాచారానికి గురైన ఎనిమిది ఏళ్ల బాలిక కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. ఈ క్రమంలో నిందితులు రోజుకో మాట మార్చడంతో బాలిక మృతదేహం ఆచూకీ లభించడం లేదని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. విజయనగరం జిల్లా జీలుగు వలసలో అత్యాచారానికి గురైన 5 నెలల చిన్నారి పేరిట రూ.5లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలకు ఎవరైన పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి అనిత హెచ్చరించారు.
Read More..
AP News:‘వారే వైసీపీ కొంప ముంచారు’..ఎట్టకేలకు బయటపడ్డ సంచలన విషయం!?