- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Breaking: వైసీపీ ఏడో జాబితా.. ఆయన పేరు పక్కా..!
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ఏడో జాబితాపై ఆ పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఒంగోలు ఎంపీగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బరిలో దించేందుకు పరిశీలన చేస్తోంది. మరోవైపు పలు అసెంబ్లీ నియోజకర్గాలకు సైతం ఇంచార్జుల పేర్లను పరిశీస్తోంది. దీంతో గుంటూరు జిల్లా తాడేపల్లి సీఎంవో కార్యాలయానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. అయితే ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే, జగన్ బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి సీటు నిరాకరించినా.. జగన్ పునరాలోచన చేయాలని ఆయన కోరుతున్నారట. ఈ మేరకు సీఎంవో కార్యాలయానికి బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్లారు. అటు బాపట్ల జిల్లా పర్చూరు వైసీపీ ఇంచార్జి అమంచి కృష్ణమోహన్ సైతం సీఎంవో కార్యాలయం బాట పట్టారు. తనకు పర్చూరు కాకుండా చీరాల అసెంబ్లీ నుంచి అవకాశం ఇవ్వాలని సీఎం జగన్‌ను కోరుతున్నారు.
అయితే సీఎంవో నుంచి పిలుపురావడంతో కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ కూడా అక్కడికి వెళ్లారు. కోడూమూరులో ఇంచార్జిని నియమించడంతో కొంతకాలంగా ఆయన అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆయనను వైసీపీ అధిష్టానం బుజ్జగిస్తోంది. ఇందులో భాగంగా సుధాకర్‌తో చర్చలు జరుపుతోంది. వీరితో పాటు ఎమ్మల్యేలు పేర్ని నాని, శ్రీదేవి, బియ్యపు మధుసూదన్ కూడా సీఎంవో కార్యాలయంలోకి వెళ్లారు. సీఎంవో అధికారులతో పాటు వైసీపీ అధిష్టాన నేతలతోనూ చర్చలు జరుపుతున్నారు. మరికొద్దిసేపట్లో వీరి భేటీ ముగియనుంది. ఆ తర్వాత సీఎంవో కార్యాలయం నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. సీఎంవోలో జరిగిన చర్చలపై మీడియాతో వివరించే అవకాశాలున్నాయి. సీఎం జగన్ నుంచి అనుకూల హామీ వచ్చిందా.. లేదా అనేది కొద్దిసేపట్లో తేలిపోనుంది. మరోవైపు ఒంగోలు ఎంపీ స్థానంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోటీ చేయించాలని వైసీపీ అధిష్టానం బలంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ పార్టీ విడుదల చేయబోయే ఏడో జాబితాలో చెవిరెడ్డి పేరు పక్కాగా ఉంటుందని ఆ పార్టీ శ్రేణులు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో...!