- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం క్షమాపణ.. అన్నట్లుంది వాళ్ల తీరు: వైసీపీ నేత

దిశ,వెబ్‌డెస్క్: తిరుపతి(Tirupati) వైకుంఠం టోకెన్ల తొక్కిసలాట ఘటన పై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఈ క్రమంలో వైసీపీ నేతలు(YCP Leaders) కూటమి ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఘటన పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పడం, అలాగే టీటీడీ బోర్డు(TTD Board) కూడా క్షమాపణ చెప్పాలని ఆదేశించిన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు కూడా ఈ ఘటన పై అధికారుల పై సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో తొక్కిసలాట ఘటన పై వైసీపీ నేత కన్నబాబు మరోసారి ఘాటుగా స్పందించారు.
తిరుమల ప్రసాదాన్ని కూటమి సర్కార్ రాజకీయం చేసిందని, అలా చేస్తే ఫలితాలు ఇలానే ఉంటాయని వైసీపీ నేత(YCP Leader) కన్నబాబు(Kannababu) విమర్శించారు. తిరుపతి తొక్కిసలాట పై సీఎం చంద్రబాబు(CM Chandrababu) క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘తిరుపతి తొక్కిసలాట ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం క్షమాపణ అన్నట్లు టీటీడీ చైర్మన్ మాట్లాడుతున్నారు. తిరుమల ప్రసాదం పై కూడా దుష్ప్రచారం చేశారు. వెంకన్న స్వామిని రాజకీయాల్లోకి లాగితే ఫలితాలు ఇలానే ఉంటాయి. ఈ సంక్రాంతి పండుగ పేదల పండుగ కాదు.. పచ్చ నేతల పండుగ’’ అంటూ ఆయన ధ్వజమెత్తారు.