- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారీగా పెరిగిన శ్రీవారి హుండీ ఆదాయం.. పది రోజుల్లో రూ.40.20 కోట్లు
దిశ, తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా గడిచిన పది రోజుల్లో శ్రీవారి హుండీ ద్వారా రికార్డు స్థాయిలో రూ.40.20 కోట్లు ఆదాయం వచ్చింది. అదే సమయంలో రికార్డు స్థాయిలో భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గత నెల 23వ తేదీ వేకువ జామున 1.45 గంటలకు తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు, జనవరి 1వ తేదీ అర్ధ రాత్రి 12 గంటల వరకు, పది రోజుల పాటు భక్తుల కోసం తెరిచి ఉంచారు. వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం కోసమని గత నెలలోనే ఆన్ లైన్ ద్వారా 2.25 లక్షల రూ.300ల టికెట్లను టీటీడీ జారీ చేసింది. దీంతో పాటు 4.23 లక్షల ఉచిత దర్శనం టోకెన్లను 10 కేంద్రాల్లో 90 కౌంటర్ల ద్వారా భక్తులకు అందజేశారు.
రోజుకు 60 వేలకు పైగా భక్తుల దర్శనం..
ప్రతి ఏటా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నిర్వహించే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలలో స్వామి వారిని దర్శించుకునేందుకు, గత ఏడాది లాగా ఈసారి కూడా వైకుంఠ ద్వార దర్శనాలను పది రోజుల పాటు భక్తులకు టీటీడీ కల్పించింది.రోజుకు సరాసరి 60 వేలకు పైగా భక్తులు స్వామివారిని వైకుంఠ ద్వారం నుంచి స్వామి వారిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. వైకుంఠ ఏకాదశి మొదటి రోజు శనివారం 67,906 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక రెండవ రోజు ఆదివారం ద్వాదశి రోజున 63,519 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, మూడో రోజు సోమవారం 69,294 మంది, నాలుగో రోజు మంగళవారం 71,488 మంది, ఐదో రోజు బుధవారం 65,361 మంది, ఆరవ రోజు 58,415 మంది, ఏడవ రోజు 56,200 మంది, ఎనిమిదవ రోజు 63,728 మంది, తొమ్మిదవ రోజు 64,665 మంది, ఆఖరి రోజు కొత్త సంవత్సరం జనవరి 1వ తేదీ 63,358 మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని పునీతులయ్యారు. ఈ పది రోజుల్లో 2,13,720 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించుకోగా, భక్తులకు 35,60,221 లక్షల లడ్డూ ప్రసాదాలను అందించారు.
రికార్డు స్థాయిలో రూ.40.20 కోట్లు ఆదాయం
గత నెల 23వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు పది రోజుల పాటు నిర్వహించిన వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలలో గడిచిన పది రోజులకు రికార్డు స్థాయిలో శ్రీవారికి ఆదాయం వచ్చింది. దర్శనాలకు వచ్చిన భక్తులు తమ మొక్కుబడి లో భాగంగా కానుకలను శ్రీవారి ఆలయ హుండీ ద్వారా సమర్పించుకోవడంతో ఏకంగా పది రోజులకు గాను రూ.40.18 కోట్ల ఆదాయం వచ్చింది. అందులో వైకుంఠ ఏకాదశి..
మొదటి రోజు రూ.2.50 కోట్లు,
రెండో రోజు రూ.5.05 కోట్లు,
మూడవ రోజు రూ.4.10 కోట్లు,
నాలుగో రోజు రూ.4.17 కోట్లు,
ఐదో రోజు రూ.3.91 కోట్లు
ఆరవ రోజు రూ.4.55 కోట్లు,
ఏడవ రోజు రూ.3.89 కోట్లు,
ఎనిమిదవ రోజు రూ.3.70 కోట్లు,
తొమ్మిదవ రోజు రూ.4.34 కోట్లు,
పదవ రోజు రూ.3.97 కోట్లు
చొప్పున ఆదాయం వచ్చింది. ఈ పది రోజులలో ఆదాయం పరిశీలిస్తే 2వ రోజైన ద్వాదశి రోజున రూ.5.05 కోట్లు అత్యధికంగా ఆదాయం రావడం విశేషం. నాలుగో రోజు అత్యధికంగా 71488 మంది శ్రీవారిని దర్శించుకోవడం గమనార్హం. ఇదిలా ఉండగా సిఫార్సుల పేరుతో అదనంగా మరో 3518 టిక్కెట్లు ఇవ్వడం తో వీటి ద్వారా అదనంగా రూ.2లక్షలు రాగా (రూ.40.18కోట్లు+2లక్షలు) మొత్తం రూ.40.20 కోట్లు స్వామి వారికి ఆదాయం వచ్చింది. అంటే ఏకంగా 6,47,452 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.
గత ఏడాది రూ.26.61 కోట్లు...
గత సంవత్సరం జనవరి 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పది రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారం కల్పించారు. ఈ పది రోజుల్లో 3,78,928 లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, హుండీ ద్వారా రూ.26.61 కోట్లు ఆదాయం వచ్చింది. భక్తులకు 19,5975 లక్షల లడ్డూ ప్రసాదం అందించారు.