ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో రాచరికపు పోకడలకు స్వస్తి.. ఉత్తర్వులు జారీ

by srinivas |
ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో రాచరికపు పోకడలకు స్వస్తి.. ఉత్తర్వులు జారీ
X

దిశ, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వం (NDA Government) అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ శాఖల్లో ప్రక్షాళన చేపట్టిన విషయం తెలిసిందే. టీటీడీ (TTD)తోపాటు, పోలీస్ (Police), ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్(Excise Department)లోనూ ఇప్పటికే పలు మార్పులు చేసింది. ప్రస్తుతం ఏపీ రిజిస్ట్రేషన్ శాఖ (AP Registration Department)లో కీలక మార్పులు చేసింది. రాచరికపు పోకడలను ఎత్తివేసింది. అంతేకాదు కార్యాలయాల్లో ఉన్న పోడియం, రెడ్ కార్పెట్‌ను తొలగించింది. మామూలు కుర్చీలను ఏర్పాటు చేసింది. సబ్ రిజిస్ట్రార్లు ఇక నుంచి ఆ కుర్చీల్లో కూర్చుని వినియోగదారుల (Consumers)కు సేవలందించాలని ఆదేశించింది. హాలిడే రోజు (Holiday) కూడా పని చేసే విధంగా ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు అధికారులందరూ పని చేసేలా ప్రణాళికలు రూపొందించింది. అంతేకాదు రిజిస్ట్రేషన్ల కోసం వారికి సైతం ప్రాధాన్యత ఇస్తోంది. పని అయిపోయే వరకు వినియోగదారులు కుర్చీల్లో కూర్చునే విధంగా ఏర్పాట్లు చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యమైతే వినియోగదారులకు టీ, మంచినీరు (Tea and Water) అందించాలని ఆ శాఖను ఆదేశించింది.

Advertisement

Next Story

Most Viewed