విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. మంత్రి కీలక ప్రకటన

by srinivas |
విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. మంత్రి కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో విద్యుత్ వినియోగదారులకు మంత్రి గొట్టిపాటి రవి కుమార్(Minister Gottipati Ravi Kumar) గుడ్ న్యూస్ తెలిపారు. విద్యుత్ ఛార్జీల అంశంపై శాసనమండలి(Legislative Council)లో ఆయన కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదని స్పష్టం చేశారు.అంతేకాదు రైతులకు పగలే 9 కరెంట్ ఉచితం ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం విద్యుత్ పై రూ. 15 వేల కోట్ల భారాన్ని మోపిందని మండిపడ్డారు. రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల దృష్ట్యా విద్యుత్ ఉత్పత్తి పెంచేలా అధికారులను ఆదేశించామని మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. గృహ వినియోగదారులకు 24 గంటల పాటు విద్యుత్ అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో వేసవి కాలం మొత్తం విద్యుత్ వినియోగం ప్రతి రోజు 260 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుందని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు.

Next Story

Most Viewed