- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Guntur: చెత్తకుప్పలో ప్రభుత్వ ఫైల్స్.. కాసేపటికే మాయం..!
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో ఏపీ ప్రభుత్వ ఫైల్స్ దగ్ధం అయిన ఘటనలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మదనపల్లె, విజయవాడలో ప్రభుత్వ శాఖలకు చెందిన ఫైల్స్‌ను దగ్ధం చేశారు. ఈ ఘటనలపై విచారణ కొనసాగుతుండగానే మరో ఘటన కలకలం రేగింది. గుంటూరు పశ్చిమ ఎమ్మార్వో కార్యాలయంలోని ప్రభుత్వ ఫైళ్లు బయట దర్శనమిచ్చారు. ఎమ్మార్వో కార్యాలయం గేటుకు సమీపంలో ఫైల్స్ పడి ఉన్నాయి. పోలీస్, రెవెన్యూ శాఖ అధికారుల ఫైల్స్‌గా అనుమానిస్తున్నారు. ఎవరు, ఎందుకు పడేశారో తెలియదు గాని ఈ ఘటన పలు అనుమానాలను తావిస్తోంది.
అయితే చెత్తకుప్పలో ఉన్న ఈ ఫైల్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఈ ఫైల్‌ను అక్కడి తీసివేశారు. ఈ ఫైల్ మాయంపై ఎమ్మార్వో సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యాలయం చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయని, వీడియోను పరిశీలిస్తామని చెప్పారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.