- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘ప్రచార ఆర్భాటాలు తప్ప చేసిందేమీ లేదు’.. మాజీ మంత్రి తీవ్ర విమర్శలు
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో టీడీపీ(TDP), వైసీపీ నేత(YCP Leaders)ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు పై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఏనాడు ప్రాజెక్టులను పట్టించుకోలేదని పేర్కొన్నారు. దివంగత వైఎస్‌ఆర్(YSR) హయాంలో కోటి ఎకరాలు సాగులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు. ఏపీలో జలయజ్ఞం పేరిట 23 ప్రాజెక్టులు పూర్తి చేశారని అన్నారు.
కానీ.. సీఎం చంద్రబాబు అన్నీ నేనే చేశా అంటారు. ‘పోలవరం నాదే.. హంద్రీనీవా నాదే’ అంటారు. ఎవరు ఏమి చేసినా తన ఖాతాలో వేసుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని అంబటి రాంబాబు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఏ ప్రాజెక్టు(Project) ఐనా దివంగత నేత వైఎస్‌ఆర్ శ్రద్ధతోనే వచ్చాయని చెప్పారు. వైఎస్ తర్వాత తిరిగి వైఎస్ జగన్(YS Jagan) మళ్లీ పనులు మొదలు పెట్టారని అన్నారు. ఇప్పటికే పోర్టులు, మెడికల్ కాలేజీలతో పాటు.. రోడ్లను ప్రైవేట్‌పరం చేశారని ఆయన ఆరోపించారు. పల్నాడు(Palnadu), రాయలసీమ(Rayalasima)కు గోదావరి నీళ్లు తేవాలని.. గతంలోనే జగన్ ఆలోచించారని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.