ఆ పని ఎవరు చేసిన కఠిన చర్యలు తప్పవు.. హెచ్చరికలు జారీ చేసిన ఎన్నికలసంఘం ..

by Indraja |
ఆ పని ఎవరు చేసిన కఠిన చర్యలు తప్పవు.. హెచ్చరికలు జారీ చేసిన ఎన్నికలసంఘం ..
X

దిశ కొండపి: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలకు ఆటకం వాటిల్లకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి ముఖేష్ కుమార్ మీనా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల్లో చేపట్టే చర్యల గురించి క్షేత్ర స్థాయిలో ఆయన పరీశీలిస్తున్నారు. తాజాగా కొండపి నియోజకవర్గం సింగరాయకొండ మండల పరిధి లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్‌ను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడయినా ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా నిన్న రాత్రి ఒంగోలు లో జరిగిన సంఘటనలో ఎన్నికల ముఖ్య అధికారికి టీడీపీ ప్రతినిధి బృందం వినతి పత్రం అందజేశారు.

టీడీపీపై దాడికి పాల్పడి, గాయపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని, దాడి చేసిన రాజకీయ ప్రత్యర్థులకు మద్దతు ఇస్తూ టీడీపీ కార్యకర్తల ఫిర్యాదులను పట్టించుకోకుండా, శాంతి భద్రతల పరిరక్షణని గాలికి వదిలిన సింగరాయకొండ, ఒంగోలు రూరల్ ఎస్సైలపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. కాగా ఎన్నికల అధికారికి వినతి పత్రం ఇచ్చి న్యాయం కోరిన వారిలో ఒంగోలు శాసన సభ్యుడు దామచర్ల జనార్దన్ రావు, పిఎ అనిల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ టీడీపీ సి కామేపల్లి శ్రీనివాస రావు తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed