- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కంటకాపల్లి రైలు ప్రమాదంలో మృతుల వివరాలివే
దిశ, డైనమిక్ బ్యూరో : విజయనగరం జిల్లా కంటకాపల్లి రైలు ప్రమాదములో మృతి చెందిన వారి వివరాలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 14 మంది మృతి చెందగా 41 మంది వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు మృతుల కుటుంబ వివరాలను వెల్లడించింది. ఈ ప్రమాదంలో లోకోపైలట్‌తోపాటు పలాస ప్యాసింజర్ గార్డ్ కూడా మృతి చెందారు. అయితే ఈ 14 మంది మృతదేహాలలో ఇప్పటి వరకు 11 మంది మృతదేహాలను గుర్తించగా మరో ముగ్గురు మృతదేహాలను గుర్తించాల్సి ఉందని విజయనగరం జిల్లా అధికారయంత్రాంగం వెల్లడించింది. మృతుల పేర్ల వివరాలను పరిశీలిస్తే కంచుబరాకి రవి(జామి-విజయనగరం), గిడిజాల లక్ష్మి(జి.సిగడాం-శ్రీకాకుళం),కరణం అప్పలనాయుడు( కాపుసంభం-విజయనగరం), చల్ల సతీశ్( విజయనగరం), ఎస్ఎంఎస్ రావు(లోకోపైలట్-విశాఖపట్నం), చింతల కృష్ణంనాయుడు)గ్యాంగ్ మెన్- కొత్తవలస-విజయనగరం), పిల్లా నాగరాజు(కాపుసంభం-విజయనగరం), ఎం శ్రీనివాస్(పలాస ప్యాసింజర్ గార్డ్), టెంకల సుగుణమ్మ(మెట్టవలస-శ్రీకాకుళం), రెడ్డి సీతంనాయుడు(చీపురుపల్లి-విజయనగరం), మజ్జి రాము( గరివిడి-విజయనగరం) అని వివరాలు వెల్లడించింది. అయితే మరో ముగ్గురు మృతదేహాలను గుర్తించాల్సి ఉందని ప్రభుత్వ అధికార యంత్రంగం వెల్లడించింది.
విజయనగరం, విశాఖలలో క్షతగాత్రులకు చికిత్స
ఇదిలా ఉంటే ఈ ప్రమాదంలో 41 మందికిపై గా తీవ్ర గాయాలు పాలైనట్లు తెలుస్తోంది. అయితే వీరిలో 38 మంది జిల్లా సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో క్షగాత్రులకు వైద్య సహాయ చర్యలను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావులు పర్యవేక్షిస్తున్నారు. మరో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉండటంతో వారిని విశాఖ కేజీహెచ్, ఎన్.ఆర్.ఐ., మెడికవర్ ఆసుపత్రిలో ఒక్కొక్కరు చొప్పన వైద్య చికిత్స అందిస్తున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. వైద్య సహాయ చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. మృతదేహాలను పోస్టు మార్టం నిర్వహించి, బంధువులకు అప్పగిస్తామని తెలిపారు.