తెలంగాణలో నుయ్యి.. ఏపీలో గొయ్యి..!

by srinivas |   ( Updated:2023-11-08 06:31:56.0  )
తెలంగాణలో నుయ్యి.. ఏపీలో  గొయ్యి..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో పోటీ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ముందు నుయ్యి.. వెనక గొయ్యి.. తరహాలో సవాలుగా మారింది. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో పోటీ ఏపీపై ఎలాంటి ప్రభావం చూపుతుందేమోనని భయం ఆయను వెంటాడుతోంది. బీజేపీతో కుదిరిన పొత్తులో భాగంగా ఎనిమిది స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించినా వారి గెలుపోటములు చాలా సవాళ్లు విసురుతున్నాయి.

ఒత్తిడితో ముందుకు..

తెలంగాణలో పోటీ చేసే విషయమై తొందరగా తేల్చేయాలంటూ పవన్ కల్యాణ్‌ మీద జనసేన కార్యకర్తలు, ఆశావహులు ఒత్తిడి తీసుకొచ్చారు. దీన్ని పరిగణలోకి తీసుకుని ఇప్పటికే ఒక దఫా సమావేశాన్ని నిర్వహించి వారి అభిప్రాయాలను తీసుకున్నారు. మోడీ సభ పూర్తికాగానే ఎనిమిది మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. వీరికి పడే ఓట్లను వైఎస్సార్సీపీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రస్తావించి జనసేనను ఇరుకున పెట్టడానికి ఎలా వాడుకుంటుందనేది చర్చనీయాంశంగా మారింది.

పోటీ చేసే స్థానాలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పొత్తు ఖరారైంది. 8 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు జనసేన మంగళవారం రాత్రి అధికారికంగా అభ్యర్థులను ప్రకటించింది. కోదాడ నుంచి మేకల సతీశ్ రెడ్డి, ఖమ్మం నుంచి మిర్యాల రామకృష్ణ, నాగర్ కర్నూల్ వంగా లక్ష్మణ్ గౌడ్, వైరాలో సంపత్ నాయక్, కొత్తగూడెం నుంచి లక్కినేని సురేందర్ రావు, కూకట్‌పల్లి నుంచి ప్రేమ్ కుమార్, తాండూరు నుంచి శంకర్ గౌడ్, అశ్వారావు పేట నుంచి మూగబోయిన ఉమాదేవిని ఖరారు చేశారు.

Advertisement

Next Story

Most Viewed