ఏపీ ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కీలక అప్‌డేట్‌

by Vennela |   ( Updated:2025-01-17 13:03:56.0  )
ఏపీ ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కీలక అప్‌డేట్‌
X

దిశ,వెబ్‌డెస్క్: Visakhapatnam Steel Plant: ఏపీ ప్రజలకు తీపికబురందించింది కేంద్రంలోని మోడీ సర్కార్(PM MODI). ఏపీ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ఏపీ అభివృద్దికి కట్టుబడి ఉన్నామని ఇటీవల ప్రకటించిన కేంద్రం.. దానికి తగ్గట్లుగానే ఇప్పుడు వరాల జల్లు కురిపించింది. తాజాగా కేంద్రం ప్రభుత్వ ఏపీకి ఆర్థిక ప్యాకేజీ(Economic package for AP)ని ప్రకటించింది. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్(Visakhapatnam Steel Plant) కోసం రూ. 11, 440కోట్ల ప్యాకేజీని ఇచ్చేందుకు కేంద్రమంత్రి వర్గం ఆమోదించిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnav) తెలిపారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెల్లడించారు. ఇప్పటి వరకు విశాఖ స్టిల్ ప్లాంట్ ప్రైవేటీకరణ(Visakhapatnam Still Plant Privatization) అవుతుందన్న అపోహలు ఆంధ్రప్రదేశ్ ప్రజలతోపాటు ఉత్తరాంధ్ర ప్రజల్లో బలంగా ఉంది. ఇప్పుడు కేంద్రం ఆర్థిక ప్యాకేజీ(Financial package)ని ప్రకటించడంతో ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేనట్లే అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఉత్తరాంధ్రకు భారీ పరిశ్రమగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakhapatnam Steel Plant)కు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం పట్ల కేంద్ర విమానయాన మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన ఎంపి రామ్మోహన్ నాయుడు(MP Rammohan Naidu) ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి అన్నీ శుభశకునాలే ఎదురవుతున్నాయి.

ఉత్తారాంధ్రకు వెన్నుముకగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం భారీ ప్యాకేజీని ప్రకటించింది. స్టీల్ ప్లాంట్ కోసం రూ. 11, 440కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. గత వైసీపీ హయాంలో వైజాగ్ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు మొగ్గుచూపిన ప్రభుత్వం..ఉత్తారాంధ్ర ప్రజలు విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఆందోళనలు చేపట్టారు. తాజాగా ఏపీలో కూటమి సర్కార్ కొలువుదీరడంతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ లేనట్లేనని కేంద్రం స్పష్టమైన సంకేతం ఇచ్చింది.

ఏపీని అన్నీ విధాలుగా డెవలప్ చేయాలని..అది కూడా ఎన్డీఏ భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని భావించిన టీడీపీ, జనసేనలు గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోడం, భారీ మెజార్టీతో గెలవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాని మోదీ ఏపీకి భారీగా ప్రాజెక్టులు కేటాయించారు.

ఏపీ డెవలప్ మెంట్ కు సహాయ, సహకారాలతోపాటు రాజధాని నిర్మాణానికి నిధులు కూడా మంజూరు చేశారు. తాజాగా ఏపీకి వచ్చిన ప్రధాన మోడీ..ఏపీ డెవలప్ మెంట్(AP Development) కోసం ప్రత్యేక చొరవ చూపిస్తామని..ప్రాధాన్యత ఇస్తామంటూ మాటిచ్చారు.దీనిలో భాగంగానే లక్షన్నర కోట్లతో పెట్టుబడులకు సంబంధించిన ప్రాజెక్టులను సైతం ప్రారంభంచారు. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్(Visakhapatnam Still Plant) కు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించడంతో ఉత్తరాంధ్ర ప్రజలే కాదు.. ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed