- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నేడు ఏపీ కి రానున్న కేంద్ర ఎన్నికల కమిషన్.. పర్యటన ఎన్ని రోజులంటే..!
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితాలో అవకతవకలున్నాయి అటు అధికార పార్టీ.. ఇటు ప్రతిపక్ష పార్టీ టీడీపీ పోటా పోటీగా కేంద్రానికి అనేకసార్లు ఫిర్యాదులు చేశాయి. దీనితో రాష్ట్రం పై ప్రత్యక ద్రుష్టి సారించిన సీఈసీ మరోసారి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించేందుకు సిద్ధమైంది. నేటి నుండి మూడు రోజుల వరకు ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటన కొనసాగనుంది. ఈ పర్యటనలో భాగంగా ఈ రోజు రాత్రికి విజయవాడ చేరుకోనుంది కేంద్ర ఎన్నికల అధికార బృందం. కాగా ఈ పర్యటనకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వం వహిస్తున్నారు.
ఆయన నేతృత్వంలోనే ఈ పర్యట కొనసాగనుంది. ఈ పర్యటనలో భాగంగా రేపు ఉదయం 10 గంటలకు వివిధ రాజకీయ పార్టీలతో కేంద్ర ఎన్నికల అధికార బృందం సమావేశం కానుంది. ఓటర్ల జాబితాలో అవకతవకలున్నాయని పార్టీలు చేసిన ఫిర్యాదు పైన రాష్ట్ర సీఈవో తో చర్చించనుంది సీఈసీ. అనంతరం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ సమీక్ష నిర్వహించనుంది. అలానే ఎన్నికల సన్నద్ధత పై ఈ నెల 10 వ తేదీన ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. కాగా ఈ నెల 10 వ తేదీ సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు మీడియాతో కమిషనర్లు సమావేశం నిర్వహిస్తారు. అనంతరం అదే రోజు కేంద్ర ఎన్నికల బృందం ఢిల్లీకి తీరు ప్రయాణం కానుంది.