- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల మహాశాంతి యాత్రను అడ్డుకున్న పోలీసులు..
దిశ, ఏపీ బ్యూరో : పాలకొల్లు నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టిడ్కో గృహాల ప్రారంభోత్సవంలో జరిగిన తీరును నిరసిస్తూ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మహా శాంతి యాత్రకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం నిమ్మల రామానాయుడు బ్రాడిపేట నుంచి మహాశాంతి యాత్రలో భాగంగా భారీ ర్యాలీగా బయలు దేరారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ అఖిల్ జామా యాత్రను అడ్డుకున్నారు. మహా శాంతి యాత్ర చేయడానికి వీలులేదని పోలీసులు స్పష్టం చేశారు. మహాశాంతి యాత్రకు అనుమతి లేదని వెల్లడించారు. దీంతో ఎమ్మెల్యేకు సీఐ అఖిల్ జామాకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. శాంతి, భద్రతల పేరుతో తమను అడ్డుకోవడం సరికాదని ఎమ్మెల్యే అన్నారు.
తమకు జరిగిన అన్యాయంపై ప్రజల్లోనే తేల్చుకుందామని వెళ్తుంటే అడ్డుకోవడంపై మండిపడ్డారు. తాను కూడా ఒక ఎమ్మెల్యేనని నిమ్మల తెలిపారు. టిడ్కో గృహాల ప్రారంభోత్సవంలో పలువురు పోలీసు అధికారులు ఉన్నప్పటికీ తమపై దాడి చేశారని అసలు స్టేజి మీద తాము ఉండాల్సి ఉండగా, దౌర్జన్యకారులు ఎందుకు ఉన్నట్లు అని నిమ్మల రామనాయుడు ప్రశ్నించారు. మరోవైపు టీడీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది.