Breaking: నంద్యాల విజయ పాల డెయిరీ వద్ద ఉద్రిక్తత

by srinivas |   ( Updated:2025-01-17 11:06:07.0  )
Breaking: నంద్యాల విజయ పాల డెయిరీ వద్ద ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: నంద్యాల విజయ పాల డెయిరీ(Nandyala Vijaya Milk Dairy) వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. డెయిరీ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న భూమా విఖ్యాత్ రెడ్డి(Bhuma Vikhyat Reddy)ని ఇటీవల పాలకవర్గం తొలగించింది. అంతేకాదు సస్పెన్షన్ వేటు కూడా వేశారు. దీంతో ఆయన హైకోర్టు(High Court)ను ఆశ్రయించారు. పాలక వర్గం విధించిన అనర్థత వేటును సస్పెండ్ చేయాలని కోరారు. ఈ క్రమంలో డెయిరీ పాలక వర్గం వర్సెస్ విఖ్యాత్ రెడ్డిగా నంద్యాలలో పరిస్థితి మారిపోయింది.

అయితే డెయిరీలో మూడు డైరెక్టర్ పదవులు ఖాళీ అయ్యాయి. ఈ మేరకు డెయిరీకి డైరెక్టర్లను ఎన్నుకునేందుకు తాజాగా నామినేషన్లను స్వీకరిస్తున్నారు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. నామినేషన్లు అడ్డుకునేందుకు విజయ పాల డెయిరీ వద్దకు భూమా అనుచరులు భారీగా చేరుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు డెయిరీ వద్ద భారీగా మోహరించారు. విఖ్యాత్ రెడ్డి అనుచరులను అడ్డుకున్నారు. డెయిరీ వద్దకు ఇతరులు వచ్చేందుకు అనుమతి లేదని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు లాండ్ ఆర్డర్ సమస్యతో విజయడెయిరీ నామినేషన్ల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు ఆ సంస్థ యాజమాన్యం ప్రకటించింది. నామినేషన్ల తేదీలను త్వరలో ప్రకటిస్తామని స్పష్టంచేసింది.

Next Story