శ్రీశైలం సత్రాల్లో ఇష్టారాజ్యం..చోద్యం చూస్తున్న ఆలయ అధికారులు

by Jakkula Mamatha |   ( Updated:2024-09-04 14:57:50.0  )
శ్రీశైలం సత్రాల్లో ఇష్టారాజ్యం..చోద్యం చూస్తున్న ఆలయ అధికారులు
X

దిశ ప్రతినిధి,శ్రీశైలం:శ్రీశైల మహా క్షేత్రంలో ప్రైవేటు సత్రాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వసతి గదుల ఒకరోజు అద్దె రూ.3 వేలు తీసుకుంటున్నారు. పర్యవేక్షణ చేపట్టాల్సిన దేవస్థానం అధికారులు చోద్యం చూస్తున్నారు. శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం ప్రతి రోజు వేలాది మంది భక్తులు శ్రీశైలం తరలి వస్తారు. శ్రీశైలం వచ్చిన భక్తులకు వసతి గది తీసుకుంటారు. భక్తులు అధికంగా ఉండే శని, ఆది, సోమవారాల్లో ఒక అద్దె, మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఒక అద్దె వసూలు చేస్తున్నారు. శని నుంచి సోమవారం వరకు ఒకరోజు ఏసీ రూమ్ అద్దె రూ. 3 వేలు, నాన్ ఏసీ రూమ్ రూ.2,500 వసూలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సత్రాలలో అద్దె వసూలును అడ్డుకోవాల్సిన దేవస్థానం అధికారులు చోద్యం చూస్తున్నారు. ఇప్పటికైనా దేవస్థానం అధికారులు స్పందించి సత్రాల్లో అధిక అద్దెల వసూలు ఆపాల్సిన అవసరం ఉంది.

Advertisement

Next Story