ఎంపీ రామ్మోహన్ నాయుడుకు కీలక పదవి అప్పగించిన కేంద్రం

by srinivas |   ( Updated:2024-06-10 14:16:03.0  )
ఎంపీ రామ్మోహన్ నాయుడుకు కీలక పదవి అప్పగించిన కేంద్రం
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు‌కు కేంద్రం కీలక పదవి అప్పగించింది. కేంద్రమంత్రిగా ఆయన ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీలో ఎన్డీయే కూటమి విజయం సాధించింది. కూటమిలో భాగంగా రామ్మోహన్ నాయుడుకు కేంద్రమంత్రి పదవి దక్కింది. దీంతో ఆయనకు సోమవారం పౌరవిమానయాన శాఖను ఖరారు చేశారు. అలాగే కేబినెట్ ర్యాంక్ హోదాను సైతం అప్పగించారు.

కాగా రామ్మోహన్ నాయుడు దివంగత నేత, మాజీ కేంద్రమంత్రి ఎర్రన్నాయుడు కుమారుడు. ఆయన మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు అనతికాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీకాకుళం నుంచి వరుసగా మూడు సార్లు ఎంపీగా రామ్మోహన్ నాయడు గెలుపొందారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించారు. దీంతో కేంద్రానికి రామ్మోహన్ నాయుడు పేరును తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించింది. ఈ మేరకు రామ్మోహన్ నాయుడుకు కేంద్రమంత్రి పదవి దక్కింది. మోడీ కేబినెట్‌లో కేంద్రమంత్రిగా పని చేయనున్నారు.

Advertisement

Next Story