- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీసీలకు Nara Lokesh కీలక హామీ
దిశ, ఏపీ బ్యూరో: వెనుకబడిన తరగతులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేందుకు ఊతమిచ్చింది కేవలం తెలుగుదేశం పార్టీయేనని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యక్తం చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా గురువారం ఆయన విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా గవర సామాజిక వర్గ నేతలతో ముఖాముఖి నిర్వహించారు. కేవలం వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న తమకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. గవర కార్పొరేషన్‌కు వైసీపీ సర్కారు ఒక్క రూపాయి ఇవ్వలేదని చెప్పారు. గవర సామాజిక నేతలు ఏకరువు పెట్టిన సమస్యలపై లోకేష్ స్పందిస్తూ టీడీపీ ప్రభుత్వం రాగానే గవర కార్పొరేషన్‌ను బలోపేతం చేస్తామని హామీనిచ్చారు. వైసీపీ సర్కారు పాలనలో 26 వేల మంది బీసీలపై అక్రమ కేసులు బనాయించినట్లు గుర్తు చేశారు. మరో నాలుగు నెలల్లో జగన్ దుర్మార్గ పాలనకు తెరపడుతుందని చెప్పారు. టీడీపీ అధికారానికి రాగానే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామని హామీనిచ్చారు. స్కిల్ డెవలప్మెంటు ద్వారా బీసీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని భరోసానిచ్చారు.
యలమంచిలి కొత్తపాలెం జంక్షన్లో కట్టుపాలెం, సోమలింగపాలెం గ్రామస్తులు లోకేష్‌ను కలిశారు. శారదా నది గేట్లు సరిగ్గా నిర్వహించనందున గ్రామల్లోకి నీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటిష్ ప్రభుత్వంలో నిర్మించిన ఏడుముళ్ల డ్యాం ఇరవై ఏళ్ల క్రితం దెబ్బతిన్నా రిపేర్లకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై 14 గ్రామాలు ఆధారపడి ఉన్నట్లు లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. ఇంకా రాంబిల్లి మండలం నుంచి రైతులు వచ్చి తమ బాధలు వెళ్లబోసుకున్నారు. మిచాంగ్ తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని వాపోయారు. శారదా నదిపై ఆనకట్ట వరదలకు కొట్టుకుపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదని రజాల గ్రామస్తులు లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు.
వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు, రైతుల సమస్యలపై లోకేష్ స్పందిస్తూ ప్రాజెక్టుల గేట్లకు గ్రీజు కూడా పెట్టలేని అసమర్థ ప్రభుత్వాన్ని చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారానికి రాగానే శారదా నదిపై కొట్టుకుపోయిన ఆనకట్టను పునర్మిస్తామని హామీనిచ్చారు. నది పరివాహక ప్రాంతాల్లోని గ్రామాల్లో సాగునీటి ఇబ్బందులను పరిష్కరిస్తామన్నారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి గ్రామీణ ప్రజల ఆదాయాలను పెంచేందుకు టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని భరోసానిచ్చారు. ఇళ్లులేని పేదలకు ప్రభుత్వమే స్థలంతోపాటు ఇల్లు నిర్మించి ఇస్తుందని లోకేష్ హామీనిచ్చారు.