Wedding invitation : టీచర్ పెళ్లి.. వెరైటీ వెడ్డింగ్ కార్డ్.. క్వశ్చన్ పేపర్ శుభలేఖ

by Ramesh N |   ( Updated:2024-08-19 14:23:20.0  )
Wedding invitation : టీచర్ పెళ్లి.. వెరైటీ వెడ్డింగ్ కార్డ్.. క్వశ్చన్ పేపర్ శుభలేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రతి ఒక్కరి వైవాహిక జీవితానికి తొలి సంతకం శుభలేఖ. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో జరిగే ఈ వేడుకకు వివాహ ఆహ్వాన పత్రిక ముద్రించి ఇచ్చి పిలవడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. అయితే, ఈ మధ్య పెళ్లి పత్రికలు చాలా మంది వెరైటీగా రోటీన్‌కు భిన్నంగా ముద్రిస్తూ ఆహ్వానితులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ టీచర్ తన వెడ్డింగ్ కార్డును వెరైటీగా ప్లాన్ చేశారు. వృత్తిరిత్యా టీచర్ కావడంతో ప్రశ్నపత్రంలా శుభలేఖను కొట్టించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరుకు చెందిన టీచర్ ప్రత్యూష పెళ్లి ఈ నెల 23న జరగనుంది.

ప్రశ్నపత్రంలా శుభలేఖ ముద్రించి.. శుభలేఖను సింగిల్ ఆన్సర్, మల్టిపుల్ ఛాయిస్ అంటూ 8 ప్రశ్నలుగా విభజించారు. అందులో వరుడు, వధువు, కన్యాదానం చేసే వారి పేర్లు, పెళ్లి తేదీ, సమయం, మండపం, విందుకు సంబంధించిన ప్రశ్నలతో నింపేశారు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టండి అని వరుడి ఫోటోతో ప్రశ్న వేస్తూ.. కింది లైన్‌లో వరుడు ఫనీంద్ర జావాబు కూడా వారే ఇచ్చారు. పెళ్లి ఏ రోజు జరుగబోతోంది? అంటూ నాలుగు మల్టీపుల్ చాయిస్‌లతో తేదీలను ఇచ్చి.. దానికి సమాధానం బ్రాకెట్లో ఇచ్చారు. ఇలా వివిధ ప్రశ్నలతో ఇన్విటేషన్ కొట్టించారు. దీనికి సంబంధించిన కార్డులు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.


Read more...

రాష్ట్రంలో మరో ఘోరం.. విద్యార్థిని బైక్‌పై ఎత్తుకెళ్లి అఘాయిత్యం

Advertisement

Next Story

Most Viewed