- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Delhi: చంద్రబాబు అరెస్ట్‌పై పార్లమెంట్‌లో పోరాటం..!
దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆధ్యతన భేటీ అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తీరు, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై చర్చిస్తున్నారు. మరో రెండు రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని ఉభయ సభల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా టీడీపీ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అంతేకాదు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అరాచకాలను నిండు సభలో బయటపెట్టాలని సూచించారు. ఇందుకు సంబంధించిన వ్యూహాలను లోకేశ్ రూపకల్పన చేస్తున్నారు.
ఈ సమావేశానికి ముందు నారా లోకేశ్ మాట్లాడుతూ చంద్రబాబు అరెస్ట్ అనేది ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని కొట్టిపారేశారు. సీఎం జగన్ అవినీతి గురించి అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎంపీ, ఎమ్మెల్యేల స్థానాలను పూర్తిగా తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కలిసి వచ్చే ప్రతి పార్టీలను స్వాగతిస్తామని లోకేశ్ చెప్పారు. వైసీపీపై పోరాటం చేసేందుకు పార్టీలు తమకు మద్దతు తెలిపాలని నారా లోకేశ్ కోరారు.