- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
TDP: నా రాజీనామాకు ఇప్పుడే సార్థకత.. మాజీమంత్రి గంటా ఆసక్తికర వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్: నా రాజీనామాకు ఇప్పుడు సార్థకత లభించిందని మాజీ మంత్రి, భీమిలి(Bhimili) ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు(MLA Ganta Srinivasa Rao) అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) ప్రవేటీకరణ విషయంలో గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేగా గంటా రాజీనామా చేశారు. అయితే శుక్రవారం విశాఖ ఉక్కు కర్మాగారం పునరుద్దరణకు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. ఆంధ్రుల ఆత్మగౌరవం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనకు నిరసనగా 2021 ఫిబ్రవరి 12 న స్పీకర్ ఫార్మెట్ లో విశాఖ నార్త్ ఎమ్మెల్యే పదవికి చేసిన నా రాజీనామాకు నిన్న కేంద్ర ప్రభుత్వ రూ.11,440 కోట్ల రివైవల్ ప్యాకేజీ ప్రకటనతో సార్థకత లభించిందని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) ప్రత్యేక చొరవ కారణంగానే ఇదంతా సాధ్యపడిందని స్పష్టం చేశారు. ఇంత భారీ సాయాన్ని పెద్ద మనసుతో అందించిన ప్రధాని నరేంద్ర మోడీకి(PM Narendra Modi), ఢిల్లీ స్థాయిలో విశేష కృషి చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కి విశాఖపట్నం ప్రజానీకం తరపున హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కార్మికులు, ఉద్యోగులు, అధికారులు ముందుండి ప్లాంట్ ను లాభాల బాటలో పరుగులెత్తించాలని గంటా కోరుకున్నారు.