Ap: విజయసాయిరెడ్డికి బిగ్ షాక్ ... ఆ కేసులో జైలుకేనా..?

by srinivas |   ( Updated:2025-03-10 16:17:10.0  )
Ap: విజయసాయిరెడ్డికి బిగ్ షాక్ ... ఆ కేసులో జైలుకేనా..?
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి(Ycp Former Mp Vijayasai Reddy) రాజకీయాలకు గుడ్ బై చెప్పిన విషయం తెలిపింది. అయితే జగన్(Jagan) హయాంలో ఆయన వ్యవహరించిన తీరు వివాదాస్పందంగా మారాయి. కానీ అధికారంలో ఉండటంతో ఆయన్ను ఏమీ చేయలేకపోయారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విజయసాయిరెడ్డి తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని కొందరు పోలీస్ స్టేషన్‌ మెట్లు ఎక్కుతున్నారు. ఈ మేరకు ఆయనపై చర్యలు తప్పవనే సంకేతాలు చాలా క్లియర్‌గా కనిపిస్తున్నాయని పలువురు అంటున్నారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్(Former Speaker Kodela Siva Prasad) పట్ల విజయసాయిరెడ్డి వ్యవహరించిన తీరే ఇందుకు కారణమని చెబుతున్నారు.

2014- 2019లో టీడీపీ(Tdp) పాలన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ సయమంలో టీడీపీ ఎమ్మెల్యే కోడెల శివప్రసాద్ స్పీకర్‌గా పని చేశారు. టీడీపీ ఐదేళ్ల పాలన పూర్తి కావడం, ఎన్నికలు జరగడం వైసీపీ అధికారంలోకి రావడం జరిగింది. అయితే కోడెల శివ ప్రసాద్ స్పీకర్‌గా పని చేసి అసెంబ్లీకి చెందిన ఫర్నీచర్‌ను సొంతంగా ఉపయోగించుకున్నారని, ఆయనపై పోలీసులు దొంగతనం కేసు నమోదు చేశారు. అలాగే మాజీ రంజీ క్రికెటర్ నాగరాజు(Former Ranji cricketer Nagaraju) లంచం ఇచ్చినట్లు ఆరోపణలు రావడంతో మరో కేసు కూడా కోడెలపై కేసు నమోదు చేశారు. అయితే కోడెల శివప్రసాద్ హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. కోడెలపై అక్రమంగా రెండు కేసులు నమోదు చేయడంతోనే మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు ఆరోపించారు.

అయితే కోడెలపై కేసు వెనుక నరసరావుపేట అప్పటి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి(Gopireddy Srinivasa Reddy)తో పాటు విజయసాయిరెడ్డి ఉన్నట్లు అప్పట్లోనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే వైసీపీ అధికారంలో ఉండటంతో ఐదేళ్ల పాటు వారిద్దరిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదులు వెళ్లలేదు. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుండటంతో కోడెల ఆత్మహత్య ఘటన తెరపైకి వచ్చింది. కోడెల ఆత్మహత్య చేసుకునేందుకు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, విజయసాయిరెడ్డితో పాటు నాగరాజు కారణమంటూ పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులకు పలువురు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే నాగరాజు అప్రూవర్‌గా మారారు. కోడెలపై తప్పుడు కేసులు పెట్టానని కేసులు వెనక్కి తీసుకున్నారు.

దీంతో విజయసాయిరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో వైసీపీ నేతలు వరుసగా అరెస్ట్ అవుతుండటంతో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు విజయసాయిరెడ్డికి చిక్కులు తప్పవనే ప్రచారం జరుగుతోంది. వైసీపీకి రాజీనామా చేసినా విజయసాయిరెడ్డి చేసిన పాపాలు మాత్రం వెంటాడుతున్నాయని పలువురు విశ్లేషకులు అంటున్నారు. విజయసాయిరెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచి పెట్టే చాన్స్ ఉండదని టీడీపీ కింద స్థాయి శ్రేణులు అనుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Next Story

Most Viewed