- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జగన్ విశాఖ పర్యటనపై టీడీపీ నేత పట్టాభి సంచలన వ్యాఖ్యలు

X
దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖలో పర్యటనపై టీడీపీ నేత పట్టాభి విమర్శలు చేశారు. స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టు కార్మికుల పోరాటాన్ని గుర్తు చేస్తే ఆయన ప్రశ్నలు సంధించారు. విశాఖలో అసలు సీఎం జగన్‌కు అడుగు పెట్టే అర్హత లేదన్నారు. లాభాల్లో ఉన్న గంగవరం పోర్టును కమీషన్ల కోసం తెగనమ్మారని ఆరోపించారు. గంగవరం పోర్టు కార్మికులు సమస్యలతో బాధపడుతంటే సీఎం జగన్ ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. గంగవరం పోర్టును ప్రభుత్వం అభివృద్ధిని పట్టించుకోకపోవడంతో పోర్టు స్తంభించిందన్నారు. తద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్‌కు బొగ్గు నిలిచిందని, ప్లాంట్‌లో ఉత్పత్తి 90 శాతానికి పైగా పడిపోయిందని పట్టాభి మండిపడ్డారు. గంగవరం పోర్టు మూసివేత, విశాఖ స్టీల్ ప్లాంట్ దుస్థితికి జగన్ కారకుడు అని పట్టాభి వ్యాఖ్యానించారు.
Next Story