- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
టీడీపీ జనసేన సీట్ షేరింగ్ వీడియో లీక్.. ఇలానే జరిగిందా..?

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల పొత్తులో భాగంగా టీడీపీ- జనసేన పార్టీలు ఇవ్వాళ తొలి జాబితాను విడుదల చేశాయి. అయితే ఈ జాబితాలో జనసేనకి కేవలం 24 సీట్లు మాత్రమే కేటాయించడం పట్ల జనసేన నేత పవన్ కళ్యాణ్ ని మోసం చేసి టీడీపీ అధినేత చంద్రబాబు సీట్లు పంచాడని వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనితో బాటు సీట్ల పంపకం ఇలా జరిగింది అని ఓ సినిమాలో డబ్బు పంచుకొనే వీడియోని వైసీపీ పార్టీ ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. అందులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సీట్లు పంచుకుంటున్నట్లుగా, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని మోసం చేసి ఎక్కువ సీట్లు తీసుకుంటున్నట్లుగా చూపించారు. అంతేగాక చంద్రబాబు, పవన్ కళ్యాన్ సీట్లు పంచుకున్న చర్చ లీక్ అయ్యింది అని రాసుకొచ్చారు.
Next Story