Tdpకి భారీ షాక్.. Ycpలో బంపర్ ఆఫర్

by srinivas |
Tdpకి భారీ షాక్.. Ycpలో బంపర్ ఆఫర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏలూరు జిల్లా కైకలూరులో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి జయమంగళ వెంకట రమణ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. జయమంగళ వెంకట రమణకు సీఎం వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అయితే మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ తెలుగుదేశం పార్టీ వీడి వైసీపీలో చేరడానికి మాజీమంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చక్రం తిప్పారని తెలుస్తోంది. పార్టీ హైకమాండ్‌తో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సైతం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ చర్చలలో భాగంగా ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో ఏపీ శాసన మండలిలో 14 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. అందులో ఒకటి జయమంగళ వెంకట రమణకు ఇస్తామని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

శాసన మండలిలో విప్ కూడా..

అంతేకాకుండా శాసన మండలిలో విప్ కూడా ఇస్తామని హామీ ఇవ్వడంతో జయ మంగళ వెంకట రమణ వైసీపీలో చేరినట్లు తెలుస్తోంది. అయితే జయమంగళ వెంకటరమణకు ఇప్పటికే ప్రభుత్వం నలుగురు గన్‌మెన్లను కూడా కేటాయించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసే పోటీ చేస్తాయని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. అంతేకాదు బీజేపీ కూడా పొత్తు పెట్టుకునే అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తుతో గనుక ఎన్నికలకు వెళ్తే టిక్కెట్ తనకు రాదని భావించిన జయమంగళ వెంకటరమణ డిసైడ్ అయ్యారు. పొత్తులో భాగంగా కైకలూరు నియోజకవర్గం నుంచి మాజీమంత్రి కామినేని శ్రీనివాసరావు లేదా ఆయన కోడలు పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరగడంతో జయమంగళ వెంకట రమణ పార్టీ వీడారని తెలుస్తోంది.

Advertisement

Next Story