- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నెల్లూరు జిల్లాపై టీడీపీ ఫోకస్ ... క్లీన్ స్వీప్ చేసేలా బిగ్ స్కెచ్
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లాపై టీడీపీ ఫోకస్ పెట్టింది. పొత్తుల్లో భాగంగా అసంతృప్తులపై దృష్టి పెట్టింది. ఆందోళనలు చెలరేగకుండా చర్చలు జరుపుతోంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే తప్పకుండా న్యాయం చేస్తామంటూ హామీ ఇస్తోంది. ఈ మేరకు అసంతృప్తులను బుజ్జగించేందుకు మాజీ నారాయణ రంగంలోకి దిగారు. తాజాగా నెల్లూరు పట్టణలో కూటమి అభ్యర్థులతో పాటు సీటు రాని బీజేపీ, టీడీపీ, జనసేన నేతలతోనూ సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీ కార్యాలయంలో ఆత్మీయ సమావేశం చేపట్టారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు, వేమిరెడ్డి, బీదా రవిచంద్ర, జనసేన పార్టీ నేత మునుక్రాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఎవరూ అసంతృప్తి చెందవచ్చని టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన గౌరవం ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కూటమి కోసం పని చేయాలని సూచించారు. నెల్లూరు జిల్లాలోని 10 సీట్లను గెలుచుకోవాలని దిశానిర్దేశం చేశారు. వైసీపీ అరాచక పాలనను తరిమికొట్టాలని మాజీ మంత్రి నారాయణ పిలుపు నిచ్చారు.