Breaking: అభ్యర్థులను ఖరారు చేసిన టీడీపీ.. వివరాలు ఇవే..

by Indraja |   ( Updated:2024-02-01 08:17:01.0  )
telugu desam party
X

దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు జోరు పెంచాయి. అంటూ ప్రచారాల్లోనూ ఇటు అభ్యర్థుల ఎంపికలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు పార్టీల అధినేతలు. ఇప్పటికే వైసీపీ 5 జాబితాలు విడుదల చేసి అభిబ్యర్ధులను ప్రకటించింది. కాగా ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల నియామకంలో జోష్ చూపిస్తుంటే సీనియర్ అయిన తెలుగుదేశం అధినేత నారా చంద్రభాబు నాయుడు మాత్రం నిదానమే ప్రదానం అన్నట్లు ఆచి తూచి అడుగులేస్తున్నారు.

ఇక ఎన్నికల సమయం కూడా దగ్గరకి వచ్చింది. ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో టీడీపీ అధిష్టానం పలు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. శ్రీకాకుళం జిల్లా ఎంపీ అభ్యర్థిగా రామ్మోహన్‌నాయుడుని నియమించింది. అలానే అనకాపల్లి నుండి దిలీప్‌ చక్రవర్తిని ఎన్నికల బరిలోకి దింపింది.

ఇక విశాఖ పట్నం నుండి ఎం.భరత్ పోటీ చెయ్యనున్నారు. ఏలూరు నుండి గోపాల్ యాదవ్, విజయవాడ నుండి కేశినేని చిన్ని, నరసరావుపేట అభ్యర్థిగా శ్రీకృష్ణదేవరాయలు, అనంతపురం నుండి కాల్వ శ్రీనివాసులు, హిందూపురం నుండి బీకే పార్థసారథి, తిరుపతి నుండి అంగలకుర్తి నిహారిక లను రానున్న ఎన్నికల్లో టీడీపీ తరుపు అభ్యర్థులుగా అధిష్టానం అధికారికంగా ప్రకటించింది.

ఇక నరసారావు పేట సీటింగ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీతో వచ్చిన విభేదాల నేపథ్యంలో పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. అయితే వైసీపీ తనకు ఏ నియోజకవర్గం నుండి టికెట్ ను ఇచ్చేందుకు తిరస్కరించిందో అదే నియోజకవర్గం నుండి శ్రీకృష్ణదేవరాయలను ఎన్నికల బరిలోకి దించింది టీడీపీ.

అలానే కేశిని చిన్ని సోదరుడు కేశినేని నాని విజయవాడ ఎంపీగా ప్రతినిధ్యం వహిస్తుండగా టీడీపీ అధిష్టానం నానిని పక్కన పెట్టి.. నాని స్తానంలో చిన్నికి అవకాశం కల్పించింది. దీనితో ఆగ్రహానికి లోనైన నాని టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. దీనితో రానున్న ఎన్నికల్లో అన్నదమ్ములిద్దరూ అధికారం కోసం తలపడనున్నారు.

Advertisement

Next Story