ఆ చేదు జ్ఞాపకాలు త్వరగా మరిచిపోవాలి.. చంద్రబాబు నూతన సంవత్సర సందేశమిదే..!

by srinivas |
ఆ చేదు జ్ఞాపకాలు త్వరగా మరిచిపోవాలి.. చంద్రబాబు నూతన సంవత్సర సందేశమిదే..!
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో కొత్త విశ్వాసంతో... అవినీతికి, అశాంతికి, అక్రమాలకు చోటులేని ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి పటిష్టమైన పునాదులు వేసేందుకు సంకల్పిద్దామని ఆయన పిలుపునిచ్చారు. మంచి రోజుల కోసం మంచి నిర్ణయాలు తీసుకుందామని, ప్రతి తెలుగువాడిని నిపుణతగల విశ్వమానవుడిగా తీర్చిదిద్దే బృహత్కార్యానికి, పేదరికానికి, అసమానతలకు తావులేని నవశకానికి నాంది పలుకుదామని చెప్పారు. కొత్త సంవత్సరం మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.

‘కోటి ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం ఆనవాయితీ. గతించిన కాలం దుర్భరంగా ఉన్నప్పుడు ఆ చేదు జ్ఞాపకాలు త్వరగా మరిచిపోవాలని, అలాంటి రోజులు మళ్లీ వెంటాడకుండా జాగ్రత్త పడాలని, మంచి రోజుల కోసం మంచి నిర్ణయాలు తీసుకోవాలని నేతన సంవత్సర ఆరంభంలో సంకల్పిస్తాం.’ అని చంద్రబాబు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed