- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టీడీపీ సభలు కళకళ..వైసీపీ సభలు వెలవెల
దిశ, వెబ్ డెస్క్: కూటమి సభలు కళకళలాడుతున్నాయని, వైసీసీ సభలు వెలవెలలాడుతున్నాయని టీడీపీ చంద్రబాబు నాయుడు సెటైర్లు వేశారు. కర్నూలు జిల్లా కౌతాళం ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడుతూ సైకో జగన్‌కు ఒక్క అవకాశం ఇచ్చి ప్రజలు మోసపోయారని మండిపడ్డారు. జగన్ ఐదేళ్ల పాలనలో రాయలసీమకు చేసిందేందని ప్రశ్నించారు. మంత్రాలయం నుంచి 80 వేల మంది వలసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమలో 102 సాగునీటి ప్రాజెక్టులను రద్దు చేసిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. ఆర్డీఎస్ ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదన్నారు. గురు రాఘవేంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని పట్టించుకోలేదని చెప్పారు. జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారని చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. సీఎం జగన్ మోసకారుడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తుంగభద్ర పక్కనే ఉన్నా కర్నూలు నియోజకవర్గానికి తాగు నీళ్లు లేవని మండిపడ్డారు. జగన్ లాంటి దుర్మార్గులు ఉంటే పిల్లల భవిష్యత్తు అంధకారమని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజల కోసమే పొత్తులు పెట్టుకున్నామని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే మంత్రాలయం అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.
Read More...
పెన్షన్ దారులకు గుడ్ న్యూస్.. పెన్షన్ల పంపిణీపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన