వైసీపీ అనే వైరస్ అంతం చేయడానికే టీడీపీ, జనసేన పొత్తు

by Ramesh Goud |   ( Updated:2024-02-08 15:29:55.0  )
వైసీపీ అనే వైరస్ అంతం చేయడానికే టీడీపీ, జనసేన పొత్తు
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీ అనే వైరస్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశిందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, మెగా బ్రదర్ నాగబాబు అన్నారు. ఇవ్వాళ పెందుర్తి నియోజకవర్గ నాయకుల సమావేశంలో మాట్లాడిన ఆయన అధికార పక్షంపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ నాయకులు విశాఖ నగరం చుట్టూపక్కల వందల కోట్ల విలువ చేసే భూములు దోచుకున్నారని ఆరోపించారు. ఈ దోపిడి ప్రభుత్వాన్ని కచ్చితంగా దించి తీరాలని తెలిపారు. 2019 లో వైసీపీ అనే వైరస్ రాష్ట్రానికి పట్టుకుందని, దానిని అంతం చేయడానికే టీడీపీ, జనసేన కలిసికట్టుగా పనిచేస్తున్నాయని అన్నారు.

ప్రజలకు న్యాయం చేయలేని వైసీపీ ప్రభుత్వం ఉన్నా ఒకటే.. ఊడినా ఒకటే అని మండిపడ్డారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించకపోతే మనకే కాదు.. మన బిడ్డలకు కూడా భవిష్యత్తు ఉండదని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఈ ప్రభుత్వం విచ్చలవిడిగా ప్రవర్తిస్తుందని, సకల సౌకర్యాలు అందుబాటులో ఉన్న ఉత్తరాంధ్రను అభివృద్ది చేయకుండా గాలికి వదిలేశారని విమర్శించారు. జనసేన, టీడీపీ అధికారంలోకి వచ్చాక తప్పకుండా మార్పు తీసుకొస్తామని, అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఇరు పార్టీల కార్యకర్తలు కలసికట్టుగా పనిచేయాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed