ఏపీకి టాటా గ్రూపు... రూ. 40 వేల కోట్ల పెట్టుబడులకు అంగీకారం

by srinivas |   ( Updated:2024-11-11 15:37:30.0  )
ఏపీకి టాటా గ్రూపు... రూ. 40 వేల కోట్ల పెట్టుబడులకు అంగీకారం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో టాటా గ్రూపు సంస్థలు(Tata group companies) పెట్టుబడులు(Investments) పెట్టేందుకు అంగీకరించాయి. రాష్ట్రంలో దాదాపు రూ. 40 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. రాష్ట్రంలో 20 హోటళ్లు ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. తాజ్, వివాంటా, గేట్ వే, సెలెక్యూషన్స్, జింబర్ హోట్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.


ఈ మేరకు టాటా గ్రూపు సంస్థల ఛైర్మన్ చంద్రశేఖరన్‌(Tata Group Companies Chairman Chandrasekaran)తో సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu), మంత్రి లోకేశ్(Minister Lokesh) భేటీ అయ్యారు. రాష్ట్రంలోని కీలక రంగాలపై పరస్పరం సహకారం అందించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. టాటా పవర్ సోలార్, విండ్ ప్రాజెక్టుల ఏర్పాటుపై ఈ భేటీలో చర్చించారు. విశాఖలో కొత్త ఐటీ డెవలప్ మెంట్ సెంటర్‌ను ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టీసీఎస్ ద్వారా 10 వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించారు.



ఈ భేటీ అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి రతన్ టాటా చాలా కృషి చేశారని తెలిపారు. ప్రస్తుతం రతన్ టాటా వారసత్వాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఏపీ అభివృద్ధిలో టాటా గ్రూపు చాలా ముఖ్యమైన వాటాదారు అని పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య రంగంలో ఏఐతో పాటు సరికొత్త టెక్నాలజీని అందుబాటులో తీసుకొస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed