సీట్ల పంచాయితీ.. జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by srinivas |
సీట్ల పంచాయితీ.. జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. దీంతో అన్ని పార్టీలు పోటీకి సిద్ధమవుతున్నాయి. అధికార వైసీపీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్తుంటే టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీట్ల వ్యవహారం నేతలను టెన్షన్‌లోకి నెట్టింది. సీటు ఎవరికి వస్తోందో రాదో తెలియక గందరగోళానికి గురవుతున్నారు. దీంతో సీట్ల అంశం త్వరగా తేల్చాలనే డిమాండ్ రెండు పార్టీల్లోనూ వినిపిస్తోంది. ఇక టీడీపీలో అయితే సీనియర్ నేతలు సైతం ఇదే డిమాండ్ చేస్తున్నారు. సీటు టెన్షన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు త్వరగా చెక్ పెట్టాలని కోరుతున్నారు. లేదంటూ అసలుకే మోసం అయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

అటు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే సీట్లు ఎవరం త్వరగా తేల్చాలంటూ బహిరంగంగా కామెంట్స్ చేస్తున్నారు. తాడిపత్రిలో బుధవారం కార్యకర్తల సమన్వయ సమావేశం నిర్శహించారు. ఈ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేవారు. టికెట్ల అంశాన్ని చంద్రబాబు త్వరగా తేల్చాలన్నారు. సీఎం జగన్ ఏవోవో మార్పులు చేస్తున్నారని సెటైర్లు వేశారు. చంద్రబాబు మాత్రం ఇంకా ప్రకటించలేదని తెలిపారు. ఎవరినో ఒకరిని అభ్యర్థిగా ప్రకటిస్తే వారు ప్రజల్లోకి వెళ్తారని తెలిపారు. చంద్రబాబు టికెట్ ఇస్తారని, గెలిచిపోతామని కొందరు నేతలు ఊహాల్లో తెలియాడుతున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రజల్లో తిరిగే నేతలే గెలుస్తారని, లేదంటే ఓడిపోతారని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed