- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap News: అమరావతిపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్
- శివరామకృష్ణ కమిటీ సిఫార్సులు అమలు చేయండి..
- సుప్రీంకోర్టును ఆశ్రయించిన మస్తాన్ వలీ
దిశ, డైనమిక్ బ్యూరో: మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. 6 నెలల్లోనే అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ప్రభుత్వం ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా రాజధాని అమరావతికి సంబంధించి సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్ వలీ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. రాజధాని విషయంలో శివరామకృష్ణ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కోరుతూ పిటిషన్‌లో కోరారు. ఇప్పటికే మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అదే తరుణంలో రైతులు సైతం హైకోర్టు తీర్పును అమలు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అమరావతిపై పిటిషన్లకు సంబంధించి అన్నింటిని కలిపి ఈనెల 31న సుప్రీంకోర్టు విచారించనుంది. ఇలాంటి తరుణంలో శివరామకృష్ణ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలవ్వడం గమనార్హం.
తిరుమల నుండి కుప్పం బయల్దేరిన నారా లోకేష్.. అభిమానుల కోలాహలం చూడండి