- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అరసవల్లిలో రెండో రోజు స్వామివారిని తాకిన సూర్యకిరణాలు
దిశ, వెబ్‌డెస్క్: అరసవల్లిలో వరుసగా రెండో రోజు శ్రీ సూర్యనారాయణ స్వామి మూలవిరాట్టును సూర్య కిరణాలు తాకే అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చి సూర్యకిరణ శోభతో దేద్దీప్యమానంగా వెలిగిపోతున్న స్వామివారిని దర్శించుకుని పులకించిపోయారు. కాగా.. శ్రీకాకుళం (Srikakulam) పట్ణణానికి 2 కి.మీ దూరంలో ఉన్న అరసవల్లి గ్రామంలో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ప్రతి ఏటా దక్షిణాయంలో అంటే అక్టోబర్ 1, 2 తేదీల్లో.. అలాగే ఉత్తరాయణంలో అంటే మార్చి 9, 10 తేదీల్లో సూర్యకిరణాలు ఆలయంలోని మూలవిరాట్‌ను నేరుగా తాకుతాయి. అయితే వాతావరణ సమస్యల వల్ల రెండేళ్లుగా ఈ సూర్యకిరణాలు స్వామివారిని స్పృశించకలేకపోయాయి. దీంతో ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాకపోవడం భక్తులను తీవ్ర నిరాశకు గురి చేసింది. అయితే ఈ ఏడాది వారి ఆశలు ఫలించి సూర్యకిరణాలు స్వామివారిని తాకాయి.