కుప్పం చంద్రబాబు పర్యటనకు వెళ్లే వారికి పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్.. రోడ్ షో కి వెళ్తే కేసులు నమోదు

by Mahesh |
కుప్పం చంద్రబాబు పర్యటనకు వెళ్లే వారికి పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్.. రోడ్ షో కి వెళ్తే కేసులు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన పై తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. కాగా నూతన జీవో ప్రకారం చంద్రబాబు కుప్పం రోడ్ షో కు, సభలకు అనుమతి లేదని పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే టీడీపీ శ్రేణులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అయినా చంద్రబాబు పర్యటనను నిర్వహించి తీరుతాం అని చెబుతున్నారు. దీంతో పోలీసులు చంద్రబాబు పర్యటనకు వెళ్లే వారికి పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అనుమతి లేని సభకు, రోడ్ షో‌కి వెళ్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. దీంతో టీడీపీ శ్రేణులు సభకు వెళ్లాలా వద్దా అనే సంగ్ధిదత నెలకొంది.

Advertisement

Next Story