- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP News:పోలింగ్ సమయంలో గొడవలు చేస్తే కఠిన చర్యలు:డీఐజీ
దిశ ప్రతినిధి,అనకాపల్లి: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అనకాపల్లి జిల్లాలో పోలీస్ శాఖ అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉందని, ఈవీఎం రవాణా కొరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్ని అన్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలను ఆదివారం ఆయన సందర్శించి భద్రతాపరమైన సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద తీసుకుంటున్న భద్రతా ఏర్పాట్లను, పోలింగ్ బూత్‌లో వెబ్ కాస్టింగ్ ఎలా జరుగుతుంది, లైటింగ్ ఎలా ఉన్నది, Q లైన్‌లు ఎలా ఏర్పాటు చేస్తున్నారు అనే విషయాలను పరిశీలించి స్థానిక పోలీస్ అధికారులకు పలు సూచనలు ఇవ్వడం జరిగిందని తెలిపారు.
ఈవీఎం రవాణా చేసే సమయంలో గాని, పోలింగ్ సిబ్బంది మీద గాని, పోలింగ్ సమయంలో గానీ ఎవరైనా గొడవలు చేస్తే వారి మీద తీవ్రమైన కఠిన చర్యలు తీసుకుంటామని డీఐజీ హెచ్చరించారు. జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉండటం వలన ఐదుగురికి మించి ఎవరు గుంపులుగా తిరగరాదన్నారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో ఓటర్లు మినహా ఇంకెవరూ ఉండకుండా చూడాలని, 200 మీటర్ల దూరంలోనే ఓటర్ల వాహనాలు నిలిపి వేయాలని, ఓటు హక్కు వినియోగించుకునే వారు మాత్రమే ఉండాలన్నారు. ఇతరులను, వాహనాలను అనుమతించరాదని చెప్పారు.
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి వాహనాలను మాత్రమే అనుమతించబడతాయన్నారు. అవి కూడా ఆర్వో అనుమతి పొందిన మూడు వాహనాలు మాత్రమే అనుమతిస్తారని, వాహనాలలో ఐదుగురికి మించి ఉండరాదన్నారు. ఓటింగ్ జరుగుతున్న విధానాన్ని పరిశీలించేందుకు అభ్యర్థిని మాత్రమే పోలింగ్ కేంద్రంలోకి అనుమతించడం జరుగుతుందన్నారు. మద్యం, నగదు, ఇతర ఆకర్షితులను పంపిణీ చేస్తుంటే సి-విజిల్ యాప్ ద్వారా గాని లేదా నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్ కు తెలియ చేయడం వలన వెంటనే చర్య తీసుకుంటామని డీఐజీ గారు తెలిపారు. డీఐజీ గారి వెంట జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ ఐపీఎస్, అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ అప్పలరాజు, అనకాపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ శంకర్రావు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Read More..