- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబుపై రాళ్ల దాడి.. యర్రగొండపాలెంలో హైటెన్షన్
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఆయన వాహనంపై దుండగలు రాళ్ల దాడి చేయడంతో చంద్రబాబు భద్రతా సిబ్బందిలో ఒకరి తలకు గాయాలయ్యాయి. అయితే చంద్రబాబు పర్యటన సందర్బంగా మంత్రి ఆదిమూలపు సురేష్ వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. దళితద్రోహి చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని యర్రగొండపాలెం వస్తారంటూ ఆయన ఫైర్ అయ్యారు.
ఓ సందర్భంలో చంద్రబాబుపై సీరియస్ అవుతూ టీడీపీ అధినేత ఎంత మందితో వస్తారో చూస్తానంటూ షర్ట్ విప్పి సవాల్ విసిరారు. చంద్రబాబు కాన్వాయ్ యర్రగొండపాలెం చేరుకోగానే దాదాపు 200 మంది వైసీపీ కార్యకర్తలు బాబూ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు వాహనశ్రేణిపై రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దాడి ఘటనపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. నా జోలికొస్టే ఖబడ్దార్ అంటూ మంత్రి క్యాంపు కార్యాలయం ఎదుట వేలు చూయిస్తూ వార్నింగ్ ఇచ్చారు. సొంత పార్టీ నేతలు దళితులను హత్యలు చేస్తూంటే ఆది మూలపు సురేష్ ఏం చేశారని చంద్రబాబు మండిపడ్డారు.