- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పవన్ కల్యాణ్‌కు మద్దతుగా స్టార్ ప్రొడ్యూసర్.. టీజర్ ఈవెంట్‌ల్లోనే ప్రచారాలు..!
దిశ, సినిమా: ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల సమయం దగ్గర పడటంతో అటు అధికార పార్టీ నేతలు, ఇటు ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రచారాల్లో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సైతం ప్రచారాల్లో జోరు పెంచారు. పిఠాపురం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయ్యడంతో.. అక్కడ పవన్ కల్యాణ్‌ను గెలిపించడం కోసం జబర్దస్త్ కమెడియన్స్, మెగా హీరోలు కూడా ప్రాచారాల్లో పాల్గొంటున్నారు.
ఈ క్రమంలేనే తాజాగా చిరంజీవి సైతం పవన్ కల్యాణ్ కోసం ప్రచారం స్టార్ట్ చేశారు. ఈ మేరకు ఆయన గురించి చెప్తూ.. ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇక నేచురల్ స్టార్ నాని కూడా పవన్‌కు మద్దతుగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ స్టార్ ప్రోడ్యూసర్ సైతం పవన్ కల్యాణ్ తరఫున ప్రచారం స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ఆయన మరెవరో కాదు.. యంగ్ ప్రొడ్యూసర్ నాగ వంశీ. ప్రస్తుతం ‘గ్యాంగ్ ఆఫ్ గోదావరి’ సినిమాతో బిజీగా ఉన్న ఆయన.. ఈ మూవీ టీజర్ రిలీజ్ ఫంక్షన్‌లో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతు ఇస్తున్నట్లు స్వయంగా తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో ఓటు హక్కు ఉన్న చాలామంది యువత హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేసుకుంటూ ఉండిపోయారు. వాళ్లంతా మే 13 వ తేదీన జరగబోయే ఎన్నికలకు తమ సొంత ఊర్లకు వెళ్లి.. ఓటు హక్కు వినియోగించుకోండి. ఈ ఓటింగ్ శాతం గెలుపు, ఓటములపై తప్పకుండా ప్రభావం చూపుతుంది. ఒక అభిమానిగా అదే మీరు పవన్ కల్యాణ్‌కు చేసే గొప్ప సేవ ఇదే’ అంటూ చెప్పుకొచ్చాడు.