- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tirupati: ఆలయాలపై శ్రీవాణి ట్రస్టు కీలక నిర్ణయం
దిశ, తిరుపతి: టీటీడీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టు (శ్రీవాణి) ద్వారా 3,615 ఆలయాల నిర్మాణం, పలు ఆలయాల జీర్ణోద్ధరణ చేపట్టామని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలో గురువారం ఆలయాల నిర్మాణంపై ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీవాణి ట్రస్టు ద్వారా ఇప్పటివరకు 1500 ఆలయాల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. మిగిలిన ఆలయాల నిర్మాణాన్ని వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ 1973 ఆలయాలను నిర్మించిందన్నారు. సమరసత సేవ ఫౌండేషన్ 320 ఆలయాల నిర్మాణం చేపట్టి 307 ఆలయాలను పూర్తి చేసిందని చెప్పారు. అదే విధంగా గ్రామాల్లో ప్రజలు కమిటీలుగా ఏర్పడి దరఖాస్తు చేసుకుంటే ఆలయాల నిర్మాణానికి ఆర్థికసాయం అందిస్తున్నామని తెలిపారు. వీటితోపాటు పలు నగరాల్లో టీటీడీ ఆధ్వర్యంలో వెంకటేశ్వరస్వామివారి ఆలయాలు నిర్మించామని ఈవో తెలిపారు.
సమరసత సేవ ఫౌండేషన్‌కు మరికొన్ని ఆలయాల నిర్మాణ బాధ్యతలు అప్పగించేందుకు యోచిస్తున్నామని ఈవో పేర్కొన్నారు. సమరసత సేవ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీవిష్ణు మాట్లాడుతూ శ్రీవాణి ట్రస్టు నిధులతో ఎస్‌సి, ఎస్‌టి కాలనీలు, కొండ ప్రాంతాలు, సముద్రతీర ప్రాంతాల్లో నిర్మించిన ఆలయాల్లో మూడు చార్టెడ్ అకౌంటెంట్ సంస్థల ద్వారా సామాజిక తనిఖీ చేశామని చెప్పారు. ఇందులో భాగంగా ఆలయాల నిర్వహణ చక్కగా జరుగుతోందని చెప్పారు. భక్తులు ఎంతో సంతోషంగా ఆలయాలను దర్శించుకుంటున్నారని తెలిపారు. గ్రామాల్లో విభేదాలను పక్కనపెట్టి ప్రజలు కలసిమెలసి ఉంటున్నారని సామాజిక తనిఖీల్లో వెల్లడైందని, ఇది ఎంతో సంతోషకరమని చెప్పారు. నూతన ఆలయాలు, జీర్ణోద్ధరణ చేపట్టిన ఆలయాల్లో ఆయా ప్రాంతాల్లో అదే వర్గానికి చెందినవారిని అర్చకులుగా నియమించారని వెల్లడించారు. ఈ ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం శ్రీవాణి ట్రస్టు నుండి ప్రతి నెలా రూ.5 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నట్టు శ్రీవిష్ణు పేర్కొన్నారు.